గ్రామాల స్వీయ నిర్బంధంతో అత్యవసర సేవలకు అంతరాయం.. అంబులెన్స్‌కైనా దారివ్వండి..!

Arun Chilukuri
Published on: 27 March 2020 12:24 PM IST
గ్రామాల స్వీయ నిర్బంధంతో అత్యవసర సేవలకు అంతరాయం.. అంబులెన్స్‌కైనా దారివ్వండి..!
X

కరోనా భయంతో కొన్ని గ్రామాలు రహదారులకు అడ్డుకట్ట వేయడంతో అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరా బాద్ లో గ్రామానికి ఎవరు రాకుండా వాటర్ ట్యాంకర్ ను గ్రామస్తులు అడ్డుపెట్టారు. గర్భిణీని తీసుకెళుతున్న 108 అంబులెన్స్ వాహనం బషీర్ బాద్ లో నిలిచిపోయింది. గ్రామాల నిర్బంధం వల్ల అత్యవసర సేవలకు ఇబ్బంది కలుగుతుందని 108 అంబులెన్స్ సిబ్బంది తమ ఆవేదనను సెల్ఫీ వీడియోలో వివరించారు.

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని గంగారం గ్రామ సరిహద్దులో రహదారిపై ముళ్లకంచెలు, బండరాళ్లు వేయడంతో అత్యవసర పరిస్థితుల్లో అటుగా వెళ్తున్న అంబులెన్స్‌కు ఆటంకంగా మారింది. వివరాల్లోకెళితే గంగారం గ్రామానికి చెందిన ఓ గర్భిణిని డెలివరీ కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లేందుకు 108 వాహనం బయల్దేరగా గ్రామ శివారులో ముళ్లకంచెలో చిక్కుకుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో చేసేదేమి లేక సిబ్బంది కిందికి దిగి ముళ్లకంచెలను పక్కకు తీసి, అంబులెన్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కరీంనగర్‌కు చేరే సరికి చాలా ఆలస్యమైందని, గర్భిణి పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడిందని 108 సిబ్బంది తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story