Venkat Reddy: BRS పార్టీ జిల్లా ఆఫీస్‌ను తక్షణమే కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు..
Venkat Reddy: ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని కలెక్టర్‌కు కోమటిరెడ్డి సూచన
Venkat Reddy: BRS పార్టీ జిల్లా ఆఫీస్‌ను తక్షణమే కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు..
Venkat Reddy: నల్గొండ పట్టణంలో అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన BRS జిల్లా కార్యాలయంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో పర్మిషన్స్ లేకుండా పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ పెట్టే...100 కోట్ల ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సూచించారు మంత్రి కోమటిరెడ్డి.
Next Story




