Breaking : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

Raj
By Raj
Updated on: 6 Dec 2019 9:47 AM IST
Breaking : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌
X

"దిశ" నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు షూట్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారని. తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారని. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలిపారు. దిశాను చంపేసిన తగులబెట్టిన చోటే నలుగురు రేపిస్టులు చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నలుగురి మృతదేహాలను షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలైనట్టు సమాచారం.

Raj

Raj

Next Story