Vegetables: పెరిగిన కురగాయల ధరలతో సామాన్యుల ఇబ్బందులు

Vegetables: మార్కెట్లో రూ.100 రూపాయల ధర పలుకుతున్న టమాట

Shekhar G
Published on: 2 July 2023 5:27 PM IST
Difficulties Of Common People Due To Increased Prices Of Vegetables
X

Vegetables: పెరిగిన కురగాయల ధరలతో సామాన్యుల ఇబ్బందులు

Vegetables: గత కొంత కాలంగా మాంసం రేట్లు కొండెక్కి మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తుంటే...ఇప్పుడు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం కూరగాయలు కొనాలంటే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. టమాట రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. హాల్‌సేల్ మార్కెట్లో టమాట కేజీ 100 నుండి 120 వరకు పలుకుతోంది. రిటైల్‌ మార్కెట్‌‌ ఇక టమాట ధర గురించి మాట్లాడకపోవడమే మంచిది.

మార్కెట్లో టమాట ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి కేజీ 2 రూపాయలు పలికితే..ఇంకో సారి 100 రూపాయలు మార్క్ దాటుతోంది. నిన్న మొన్నటి వరకు 20 రూపాయలు ఉన్న టమాటా ఇవాళ 100 రూపాయలు దాటడంతో, ధరతో సామాన్య ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రభుత్వం మార్కెటింగ్ శాఖతో సబ్సిడీ క్రింద టమాటా పంపిణీ చేపట్టింది. కడప జిల్లా వ్యాప్తంగా మార్కెట్లో ఎవరైనా ఆధార్ కార్డు చూపించి ఒక కేజీ టమోటా తీసుకోవచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే నామ మాత్రంగా కొంత మేరకు కాసేపు పంపిణీ చేసి తర్వాత బ్లాక్‌లో అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story