Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి రహదారిపై డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

Khammam: ట్యాంకర్‌ నుంచి భారీగా లీకవుతున్న డీజిల్‌

Shashank Gullapelli
Published on: 16 April 2024 5:09 PM IST
Diesel Tanker Overturned On Sathupalli Road In Khammam District
X

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి రహదారిపై డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై అదుపుతప్పి డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఖమ్మం నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి పట్టణంలోని ప్రధాన రహదారిపై బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి భారీగా డీజిల్ బయటకు పోవడంతో ఆందోళన నెలకొంది. ట్యాంకర్ బోల్తా పడిన స్థలానికి కొద్దిపాటి దూరంలో భోజన హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. డీజిల్ భారీగా పోతుండటం గమనించి.. చుట్టుపక్కల హోటళ్లను మూసివేయించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని.. డీజిల్‌ ట్యాంకర్‌ నుంచి మంటలు చెలరేగకుండా ప్రత్యేక ద్రావణాన్ని స్ప్రే చేశారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కు మంటున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story