
ఫిబ్రవరి చివరి వారంలో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పి, చివరకు ప్రభుత్వం దానిని భంగం చేస్తూ గడువును డిసెంబర్ 31 వరకు సాగదీస్తూ, ఉత్తర్వులు వెలువరించింది. ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.
తాండూరు: మండల శాఖ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి మాట్లాడుతూ... ఉద్యోగాలను పనంగా పెట్టి, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చిన్న చూపు చూడడమే కాకుండా, అనేక అవమానాలకు గురి చేస్తూ వంచనకు పాల్పడుతోంది. అందులో భాగంగానే 2020 ఫిబ్రవరి చివరి వారంలో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పి, చివరకు ప్రభుత్వం దానిని భంగం చేస్తూ గడువును డిసెంబర్ 31 వరకు సాగదీస్తూ, ఉత్తర్వులు వెలువరించింది. ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.
పిఆర్సి ఏర్పాటు చేసినప్పుడు నెలరోజుల్లోనే అమలు చేస్తామని, స్వయంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మొదలు ఆర్టీసీ సమ్మె సందర్భంగా, మూడు రోజుల్లో పిఆర్సీ అమలు అనే ప్రకటన వరకు అనేక సార్లు గడువులు పెంచుతూ, తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తూ వ్యూహాత్మకంగా పత్రికలకు లీకులు అనేకసార్లు ప్రకటనలు ఇస్తూ, ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రజలలో వ్యతిరేకతను పెంచి, పోషిస్తుంది. వార్తాపత్రికలు పాఠకులుగా ఉన్న సామాన్య ప్రజల దృష్టిలో ఇప్పటికే మూడుసార్లు జీతాలు పెంచినట్లుగా ప్రచారం జరుగుతోంది. పిఆర్సి మీద మీద ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి యొక్క నిలకడ , నిబద్ధత, నిజాయితీ లేని ప్రకటనలు విధానాల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాం.
అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఆడంబరాలు, ఆలయాలు, యజ్ఞయాగాదులకు అడ్డంకిగా లేని, ఆర్థిక మాంద్యం ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో, మాత్రమే ఎందుకు అడ్డు పడుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా గడువు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేసి 1.7.2018 నుండి అమలు కావాల్సిన పిఆర్సి ఇప్పటికే ఆలస్యమైన దరిమిలా గడువు పొడిగింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి, పిఆర్సి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో పోరాటానికి సిద్ధమని తెలియజేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకొని ఐక్యంగా పోరాటానికి కి సిద్ధమై పాలను స్థంభించేలా ఉద్యమానికి సిద్ధం కావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు రాజు లింగు, భరత్ , తాండూరు మండల బాధ్యులు చక్రపాణి, సంపత్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




