కాంగ్రెస్‌ను వీడి చరిత్రాత్మక తప్పు చేశా : డీఎస్

admin1
Updated on: 22 Jan 2020 10:09 AM IST
కాంగ్రెస్‌ను వీడి చరిత్రాత్మక తప్పు చేశా  : డీఎస్
X

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడి చరిత్రాత్మక తప్పిదం చేశానన్నారు. తండ్రి , కొడుకు, కూతురు బాగు పడితే బంగారు తెలంగాణ అయినట్లా అని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. దిగ్విజయ్ సింగ్‌ తనపై సోనియాకు తప్పుడు రిపోర్ట్‌ ఇవ్వడం వల్లే మనస్థాపంతో పార్టీ వీడానని చెప్పారు. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే తనను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా.. తన సస్సెన్షన్‌ తీర్మానంపై సంతకాలు పెట్టారని డీఎస్‌ పేర్కొన్నారు.

admin1

admin1

Next Story