
హైదరాబాద్ నగరంలో ప్రియాంక రెడ్డిని హతమార్చిన నిందుతులను ఉరి తియాలని కోరుతూ, శనివారం జహీరాబాద్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
జహీరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రియాంక రెడ్డిని హతమార్చిన నిందుతులను ఉరి తియాలని కోరుతూ, శనివారం జహీరాబాద్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్ నుండి హౌసింగ్ బోర్డు కాలనీల మీదుగా, రెవిన్యూ డివిజన్ కార్యలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యలయంలో అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రియాంక రెడ్డి పై అత్యాచారం జరిపి, అతికిరాతకంగా దహనం చేయడం దారణమన్నారు. ఈ సంఘటనను సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కోన్నారు. ప్రియాంక రెడ్డి నిందితులను కఠనంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీ, విద్యార్థి సంఘలు, డిడిఎస్ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా కో - కన్వీనర్ జి.వీరారెడ్డి, పట్డణ అధ్యక్షులు జానమ్మగారి శ్రీనివాస్ రెడ్డి, సంఘం నాయకులు ఎల్. మోహన్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కేతకి మోహన్ రెడ్డి, నలంద శ్రీనివాస్ రెడ్డి, కె.జనార్ధన్ రెడ్డి, ఎన్. నర్సింహరెడ్డి, కోత్తుర్ శ్రీనివాస్ రెడ్డి, మురళిధర్ రెడ్డి, యాదవ్ రెడ్డి, చల్ల ప్రభాకార్ రెడ్డి, సంగారెడ్డి, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




