CV Anand: హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్‌

CV Anand: విజిలెన్స్‌ డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Sept 2024 4:47 PM IST
CV Anand again as Hyderabad CP
X

CV Anand: హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్‌

CV Anand: హైదరాబాద్‌ పోలీస్ బాస్‌గా.. ఐ యామ్ బ్యాక్ అన్నారు సీవీ ఆనంద్. పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్‌.. సీవీ ఆనంద్‌ను మళ్లీ హైదరాబాద్‌ సీపీగా నియమించింది. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న ఆనంద్‌ను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా బదిలీ చేసింది సర్కార్.

అలాగే ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్‌, పోలీస్‌ పర్సనల్‌ అడిషనల్‌ డీజీగా మహేష్‌ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో హైదరాబాద్‌ సీపీగా పని చేసిన సీవీ ఆనంద్.. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో తనదైన మార్క్ చూపించగలిగారు. దీంతో మరోసారి ఆయననే.. సీపీగా నియమిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌కు చెందిన సీవీ ఆనంద్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌కు వచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story