Hyderabad Regional Ring Road: హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌ రోడ్డుపై సీఎస్‌ శాంతికుమారి సమీక్ష

Hyderabad Regional Ring Road: హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌ రోడ్డు కోసం సెప్టెంబర్ రెండోవారం లోగా భూసేకరణ పూర్తిచేయాలన్నారు సీఎస్‌ శాంతికుమారి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Aug 2024 8:24 PM IST
Hyderabad Regional Ring Road
X

Hyderabad Regional Ring Road: హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌ రోడ్డుపై సీఎస్‌ శాంతికుమారి సమీక్ష

Hyderabad Regional Ring Road: హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌ రోడ్డు కోసం సెప్టెంబర్ రెండోవారం లోగా భూసేకరణ పూర్తిచేయాలన్నారు సీఎస్‌ శాంతికుమారి. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్‌.. భూ సేకరణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

భూసేరణకు సంబంధించిన నష్ట పరిహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయంగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు సరైన నష్టపరిహారం అందే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి.. మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందివ్వాలని సూచించారు. కోర్టు కేసులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్‌.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story