Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కుంగిన రోడ్డు

Crooked Road In Kukatpally Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కుంగిన రోడ్డు

Highlights

Hyderabad: 9 ఎకరాల్లో భారీ నిర్మాణం చేపడుతున్న ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో రోడ్డు కుంగిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గౌతమినగర్‌లో ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ 9 ఎకరాల్లో భారీ నిర్మాణం చేపడుతోంది. ఇందులో భాగంగా.. సెల్లార్‌ నిర్మాణం కోసం 60 అడుగుల గొయ్యిని తవ్వారు. రాత్రి సమయంలో జిలెటిన్‌ స్టిక్స్‌తో పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో రోడ్డుపై బీటలు ఏర్పడటంతో పాటు.. సెల్లార్‌ గుంత కోసం రోడ్డు అంచువరకు తవ్వేయడంతో గౌతమినగర్‌లో రహదారి సగం వరకు కొట్టుకుపోయింది.

రోడ్డు కింద ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్‌ పగిలి, మురుగు నీరు సెల్లార్‌ గోతిలోకి చేరుతున్నాయి. ఇదే విషయంపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేపడుతున్న నిర్మాణం వల్ల తమ కాలనీకి ముప్పు పొంచి ఉందని, సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ముప్పు సంభవిస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కారు కాలనీవాసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories