హైదరాబాద్‌ పరిధిలో వార్షిక క్రైమ్ రిపోర్ట్‌ను వెల్లడించిన సీపీ

హైదరాబాద్‌ పరిధిలో వార్షిక క్రైమ్ రిపోర్ట్‌ను వెల్లడించిన సీపీ
x
Highlights

బెస్ట్ క్వాలిటీలో హైదరాబాద్‌ పోలీసులకు దేశంలోనే అగ్రస్థానం దక్కిందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 2020లో 10శాతం...

బెస్ట్ క్వాలిటీలో హైదరాబాద్‌ పోలీసులకు దేశంలోనే అగ్రస్థానం దక్కిందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 2020లో 10శాతం నేరాలు తగ్గాయని సీపీ తెలిపారు. నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలో మహిళలపై అత్యాచార కేసులు బాగా తగ్గాయని సీపీ వివరించారు. 2019లో 25వేల 187 కేసులు నమోదయితే ఈ ఏడాది 22వేల 6వందల 41 కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు.

అలాగే పిల్లలపై 35శాతం వరకు నేరాలు తగ్గాయని సీపీ వివరించారు. 2019లో పిల్లలపై 339 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 221 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇక జీహెచ్ఎంసీలో కోటి 46లక్షల, 55వేల 5వందల 20 రూపాయాల నగదు సీజ్‌ చేసినట్లు సీసీ వెల్లడించారు. నేరాల శాతం తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్ పోలీసులకు ప్రభుత్వం, డీజీపీ నుంచి ప్రశంసలు దక్కాయని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories