KTR Birthday: ఇవాళ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు

KTR Birthday: వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వినూత్నంగా బర్త్ డే విశేష్ * 100 అడుగుల్లో రూపొందించిన హరిత ఆర్ట్..

Sandeep Eggoju
Updated on: 24 July 2021 2:16 PM IST
Created the Hundred Feet KTR Haritha Art On the Occasion of KTR Birthday
X

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

KTR Birthday: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఖిలా వరంగల్‌లో ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో వంద అడుగుల్లో కేటీఆర్ హరిత ఆర్ట్ రూపొందించి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ నిర్వహించొద్దని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ సహాయకచర్యలో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తన జన్మిదిన వేడుకల కోసం హైదరాబాద్ ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరినీ కలవడం లేదని చెప్పారు. రాష్ట్రంలో సామాజిక అడవుల పెంపకం కోసం విరివిగా మొక్కలు నాటాలని, ముక్కోటి వృక్షార్చనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు..


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story