సీపీ సజ్జనార్ కు ఆడపిల్లల పై మమకారం!

ఆడపిల్లలంటే సీపీ సజ్జనార్ కు అభిమానమే. అలాంటి వారిని వేధించినా, అఘాయిత్యానికి పాల్పడిన వారిపట్ల కొదమసింహంలా మారిపోతాడు.

S. Srikanth
Updated on: 6 Dec 2019 11:39 AM IST
సీపీ సజ్జనార్ కు ఆడపిల్లల పై మమకారం!
X
సీపీ సజ్జనార్

మంగపేట: ఆడపిల్లలంటే సీపీ సజ్జనార్ కు అభిమానమే. అలాంటి వారిని వేధించినా, అఘాయిత్యానికి పాల్పడిన వారిపట్ల కొదమసింహంలా మారిపోతాడు. గతంలో ఓ యువతిపై వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడిలో ముగ్గురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. ప్రస్తుతం దిశ నిందితులను కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు కూడా సైబరాబాద్ సీపీ గా సజ్జనార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా సీపీ సజ్జనార్ కు ఆడపిల్లలు అంటే అభిమానం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. 2008 లో మంగపేటలో పోలీసుల ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు.

ఈ సమయంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందచేసే సమయంలోనే నిరుపేద విద్యార్థులకు ఎదో ఒకటి చేయాలనే ఆలోచనతో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించాలనుకున్నారు. 2008 పదో తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచి బాసరలోని ట్రిపుల్ ఐటీ చదువులకు ఎంపిక అయిన కళ్లెబోయిన అనూషతో పాటు మరికొందరిని వేదిక పైకి పిలిచి అప్పటి ఎమ్మెల్యే పొడెం వీరయ్య చేతులమీదుగా శాలువా కప్పించి, కొంత నగదును అందచేసి, సన్మానింపచేసి అభిమానాన్ని చాటుకున్న ఘనత సజ్జనార్ సార్ కే దక్కింది.


S. Srikanth

S. Srikanth

Next Story