H ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 10K రన్‌

* ఉప్పల్‌ సర్కిల్‌లో ప్రారంభించిన సీపీ మహేష్‌ భగవత్ * తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి -సీపీ * ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి -సీపీ

Sandeep Eggoju
Updated on: 3 Jan 2021 11:28 AM IST
H ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 10K రన్‌
X

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అయినప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌. కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ H ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌ సర్కిల్‌ నుంచి 10K రన్‌ను ఆయన ప్రారంభించారు. లాక్‌డౌన్‌ సమయంలో H ఫౌండేషన్‌ నిర్వాహకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని పోలీస్‌ సిబ్బందికి కూడా మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారని వారిని అభినందించారు. కొత్త కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు సీపీ మహేష్‌ భగవత్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story