హాజీపూర్ వరుస హత్యల కేసులో సంచలన తీర్పు

హాజీపూర్ వరుస హత్యల కేసులో సంచలన తీర్పు
x
Highlights

హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది.

హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫోక్సో స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కూడా నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని వాదనలు వినిపించింది.

ఈ నేపథ్యంలో ఫోక్సో స్పెషల్ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉఠ్కంఠ నెలకొంది. ఇటీవలే సమత హత్య కేసులో నిందితులైన ముగ్గురికి ఉరిశిక్ష పడటంతో.. ఈ హాజీపూర్ వరుస హత్యల కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమత కేసులో లాగానే ఈ కేసులో కూడా శిక్ష వెలువడ నుందా..? లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సాక్ష్యలు పరిశీలించిన తరువాత కోర్ట్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష విధించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories