మహిళలను గౌరవించినపుడే దేశం ముందుకు వెళ్తుంది

దేశంలో మహిళలపై పై జరుగుతున్నా అఘాయిత్యాలు దారుణమని వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పష్టం చేసారు.

S. Srikanth
Published on: 2 Dec 2019 10:15 AM IST
మహిళలను గౌరవించినపుడే దేశం ముందుకు వెళ్తుంది
X
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

వరంగల్: దేశంలో మహిళలపై పై జరుగుతున్నా అఘాయిత్యాలు దారుణమని వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పష్టం చేసారు. భవిషత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళలను గౌరవించినపుడే దేశం ముందుకు వెళుతుందని దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తి తో ఎదిగి మరికొంత మంది యువకులకు ఆదర్శం కావాలని స్పష్టం చేసారు.

హిమాచల్ ప్రదేశ్ గొప్ప పర్యాటక కేంద్రమని అక్కడి మాదిరి తెలంగాణ రాష్ట్రము లో ఉన్న చారిత్రక కట్టడాలను సైతం టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని ఇందు కోసం హైదరాబాద్ లో ఒక కేంద్రం నెలకొల్పతామని తెలిపారు. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన గోకుల్ ఇంటలెక్చవల్ ఫోరమ్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తొలి సారి వరంగల్ కి రావడం తో ఆయనని సత్కరించారు.


S. Srikanth

S. Srikanth

Next Story