Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2, 751 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Updated on: 29 Aug 2020 10:24 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2, 751 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2, 751పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,20,166కి చేరింది. మృతుల సంఖ్య 809కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 89,350కి చేరింది.ప్రస్తుతం 30,008 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 75.2కు చేరుకుంది. జీహెచ్ఎంసీలో - 432, కరీంనగర్- 192, ఖమ్మం 132, మహబూబాబాద్- 64మంచిర్యాల- 86, మేడ్చెల్- 128, నల్గొండ- 147, నిజామాబాద్- 113, రంగారెడ్డి- 185, సిద్దిపేట- 96 వరంగల్ అర్బన్- 101 కేసులు నమోదయ్యాయి.




S. Srikanth

S. Srikanth

Next Story