Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,092 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Updated on: 6 Aug 2020 9:13 AM IST
Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,092 పాజిటివ్ కేసులు..
X
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(బుధవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,092 పాజిటివ్ ‌కేసులునమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కి చేరింది. మృతుల సంఖ్య 589కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,289 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 52,103కి చేరింది. ప్రస్తుతం 20,358 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 21,346 మంది నమూనాలను పరీక్షించగా, 2,092 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,43,489 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. బుధవారం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇంకా 1,550 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 535, మేడ్చెల్-126, రంగారెడీ-169, వరంగల్ అర్బన్-128, సంగారెడ్డి-100, నిజామాబాద్-91 కేసులునమోదుఅయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 71.3గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


S. Srikanth

S. Srikanth

Next Story