Coronavirus: హైదరాబాద్ మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు

Coronavirus: హైదరాబాద్ మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు
x
Representational Image
Highlights

తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. తాజా ఇవాళ కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్‌ వెల్లడించారు. బాధితులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. వారితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల గుర్తించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తెలిపారు. అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించామన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోనే 296 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి 131 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ రెండూ కలిపితే 417 కేసులు అవుతాయి. తెలంగాణలో ఉన్న మొత్తం 776 (డిశ్చార్జ్ అయిన వారితో కూడా కలిపి) కరోనా కేసుల్లో సగానికి పైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories