తెలంగాణలో కొత్తగా 41 కేసులు..

Krishna
Published on: 24 May 2020 8:30 PM IST
తెలంగాణలో కొత్తగా 41 కేసులు..
X
Representational Image

తెలంగాణలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా తగ్గడం లేదు.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో GHMC పరిధిలో 23, రంగారెడ్డిలో 1, వలస కార్మికులకు 11, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా సోకినట్లుగా వెల్లడించింది.. ఇక ఈరోజు 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1854 కి చేరుకుంది.

ఇక మొత్తం రాష్ట్రంలో కరోనాతో పోరాడి 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 709 యాక్టివ్ కేసుల ఉన్నాయి. కరోనాతో పోరాడి 53 మంది మృతి చెందారు. అటు కరోనాని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మే 31 వరకు లాక్ డౌన్ ని విధించింది.




Krishna

Krishna

Next Story