Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,426 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Updated on: 11 Sept 2020 9:08 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,426 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,426 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 2,324 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,52,602కి చేరింది. మృతుల సంఖ్య 940కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,19,467కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,195 యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 25,240మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.68 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ చెప్పింది. అలాగే రికవరీ రేటు 78శాతంగా ఉందని, ఇది దేశ సగటు (77.83) కంటే ఎక్కువని పేర్కొంది. బుధవారం ఒకే రోజు 62,890 శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు 20,16,461 నమూనాలను పరిశీలించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో కొత్తగా 338, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 172, రంగారెడ్డిలో 216 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. జిల్లాల్లో మాత్రం పెరుగుతున్నాయి.




S. Srikanth

S. Srikanth

Next Story