Top
logo

తెలంగాణలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..

తెలంగాణలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..
X
Highlights

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(గురువారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,207 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కి చేరింది. మృతుల సంఖ్య 601కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,136 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 53,239కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 23, 495 మంది నమూనాలను పరీక్షించగా, 2,207 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,66,984 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ పరీక్షలకు సంబంధించి ఇంకా 1,550 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 532, మేడ్చెల్-136, రంగారెడీ-196, వరంగల్ అర్బన్-142, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, కరీంనగర్‌ 93, ఖమ్మం 85, సంగారెడ్డి-100, నిజామాబాద్-89, జోగులాంబ గద్వాల జిల్లా 87, కామారెడ్డి 96, కేసులునమోదుఅయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 71.3గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


Web TitleCoronavirus updates in Telangana 2207 New Cases Registered in Last 24 Hours
Next Story