Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు...
x
Highlights

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,052కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,143 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,74,774కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,44,073కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,649 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 82.43శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 22,620 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. మొత్తం 25,73,005 టెస్టులు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 309, కరీంనగర్‌లో 127, మేడ్చల్‌లో 147, నల్గొండలో 113, రంగారెడ్డి 166, వరంగల్ అర్బన్‌లో 95, కేసులు నమోదయ్యాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories