Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Updated on: 20 Sept 2020 9:40 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,811 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 08, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,033కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,192 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,71,306కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,39,700కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,573 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.54శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. మొత్తం 24,88,220 టెస్టులు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 322, కరీంనగర్‌లో 132, మేడ్చల్‌లో 146, నల్గొండలో 124, సిద్దిపేటలో 109, వరంగల్ అర్బన్‌లో 90, ఖమ్మంలో 90 కేసులు నమోదయ్యాయి.




S. Srikanth

S. Srikanth

Next Story