Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 15 Sept 2020 9:18 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు
X

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 51,247 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 2,180 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. మృతుల సంఖ్య 984కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,29,187కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.1శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 23,534 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. మొత్తం 22,20,586 టెస్టులు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 277, రంగారెడ్డిలో 143, కరీంనగర్‌లో 135, ఖమ్మం 103 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.



S. Srikanth

S. Srikanth

Next Story