Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 18 Sept 2020 8:48 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 50,634 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,016కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,802 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,35,357కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.02శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 24,081 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. మొత్తం 23,79,950 టెస్టులు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 314, రంగారెడ్డిలో 174, కరీంనగర్‌లో 114, నల్గొండ 131, మేడ్చల్ మల్కాజ్ గిరి 144, సిద్దిపేట 121, వరంగల్ అర్బన్ 108 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.





S. Srikanth

S. Srikanth

Next Story