తెలంగాణలో కొత్తగా 1,921 పాజిటివ్ కేసులు...

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Updated on: 14 Aug 2020 9:06 AM IST
తెలంగాణలో కొత్తగా 1,921 పాజిటివ్ కేసులు...
X
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(గురువారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,921 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88,396కి చేరింది. మృతుల సంఖ్య 674కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,210 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 64,284కి చేరింది. ప్రస్తుతం 23,438 మంది చికిత్స పొందుతున్నారు. నిన్నఒక్కరోజే 22,046 మంది నమూనాలను పరీక్షించగా 1,921 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఒక్క హైదరాబాద్ లోనే 44,156 నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 356, మేడ్చెల్ 168, రంగారెడ్డి జిల్లా 134, కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.72గా ఉంది. దేశంలో 70.76గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.76 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.99 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

S. Srikanth

S. Srikanth

Next Story