Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1891 కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 2 Aug 2020 10:04 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1891 కేసులు..
X
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(శనివారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,918 పాజిటివ్‌ కేసులునమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది. మృతుల సంఖ్య 540కి పెరిగింది. గురువారం ఒక్క రోజే 1,088 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47,590కి చేరింది. ప్రస్తుతం 18,547 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 19,202 మంది నమూనాలను పరీక్షించగా, 1891 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,77,795 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 517, రంగారెడ్డిలో 181, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 146, వరంగల్‌ అర్బన్ 138, నిజామాబాద్‌ జిల్లాలో 131, సంగారెడ్డిలో 111 కేసులునమోదు అయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.3 శాతంగా ఉందని, మరణాల రేటు 0.83 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో 16 ప్రభుత్వ, 23 ప్రైవేట్ ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, సీబీ నాట్ కరోనా పరీక్షా కేంద్రాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


S. Srikanth

S. Srikanth

Next Story