Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,554 కేసులు..

Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,554 కేసులు..
x
Corona Recovered Patient Died With Heart Attack In Hyderabad Private Hospital
Highlights

Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నేడు అధికంగా 1,554 కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 842, మేడ్చల్‌లో 96, సంగారెడ్డిలో 24, రంగారెడ్డిలో 132, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్ అర్బన్ 30, వరంగల్ రూరల్ 36, కరీంనగర్ 73, నిర్మల్ 01, యదాద్రి భువనగిరి 08, జగిత్యాల్ 03, మేహబూబాబాద్ 11, పెద్దపల్లి 23, మెదక్ 25, మహబూబ్ నగర్ 14, మంచిర్యాల 03, కొత్తగుడెం 01, నల్గొండ 51, సిరసిల్ల 18, ఆసిఫాబాద్ 02, ఆదిలాబాద్ 08, వికారాబాద్ 01, నగర్ కర్నూల్ 14, నిజామాబాద్ 28, ములుగు 08, వనపర్తి 21, సిద్దిపేట 02, సూర్యాపేట 22, గద్వాల్ 05, కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 49,259కి చేరింది. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 37,666 మంది డిశ్చార్జ్ కాగా.. 438 మంది కరోనాతొ పోరాడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒక్క రోజే 1,281 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో 9 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 76.5 శాతంగా ఉందని, మరణాల రేటు 0.88 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 37,724 కేసులు నమోదు కాగా, 648 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 28,492 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 11,92,915 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,11,113 ఉండగా, 7,53,049 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 28,732 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,43,243 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,47,24,546 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories