తెలంగాణలో కొత్తగా 154 కేసులు...

తెలంగాణలో  కొత్తగా 154 కేసులు...
x
Representational Image
Highlights

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(శనివారం) ఒక్క రోజే 206 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 154కేసులు నమోదయ్యాయి. వీటిలో...

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(శనివారం) ఒక్క రోజే 206 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 154కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 132 కేసులు వెలుగు చూశాయి. ఇవాళ ఒక్కరోజే 10 మంది బాధితులు మరణించారు. రంగారెడ్డి 12, మేడ్చల్ 3, యాదాద్రి 2, సిద్దిపేట 1, నగర్ కర్నూల్ 1, మహబూబాబాద్ 1, కరీంనగర్ 1, సంగారెడ్డి లో ఒక్కో కేసు నామోదయ్యింది.

ఇవాళ ఒక్కరోజే 14 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 137 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,650కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1742 మంది డిశ్చార్జ్ అయ్యారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9971 కేసులు నమోదు కాగా, 287 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,46,628 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,20,406 ఉండగా, 1,19,292 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 6929 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,42,069. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 46,66,386. భారత్ లో 48.02 గా కరోనా రికవరీ రేటు.



Show Full Article
Print Article
Next Story
More Stories