Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,286 కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Updated on: 4 Aug 2020 9:58 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,286 కేసులు..
X
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(సోమవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1, 286 పాజిటివ్‌కేసులునమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 68,946కి చేరింది. మృతుల సంఖ్య 563కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1066 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 49,675కి చేరింది. ప్రస్తుతం 18,708 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 13787 మంది నమూనాలను పరీక్షించగా, 1, 286 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,01,025 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 391, ఆదిలాబాద్ 09, బద్రాద్రి కోతగుడెం 38, జగత్యాల 22, జనగామ 08, భూపాల్ పల్లి 06, గద్వాల్ 55, కామారెడ్డి 06, ఖమ్మం 41,ఆసిఫాబాద్ 03, మహబూబ్ నగర్ 39, మహబూబాబాద్ 27, మంచిర్యాల 21, మేడ్చల్ 72, మెదక్ 7, ములుగు 5, నగర్ కర్నూల్ 29, నల్గొండ 29, నారాయనకేడ్ 04, నిర్మల్ 04, నిజామాబాద్‌ 59, రంగారెడ్డిలో 121, పెదపల్లి 29, సంగారెడ్డి 15, సిద్దిపేట 14, సూర్యాపేట 23, వికారాబాద్ 17, వనపర్తి 14, వరంగల్ రూరల్ 11, వరంగల్‌ అర్బన్ 63, భువనగిరి 03 కేసులునమోదుఅయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


S. Srikanth

S. Srikanth

Next Story