Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,198 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!

Coronavirus updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,198 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Updated on: 20 July 2020 8:56 PM IST
Coronavirus updates in Telangana:  తెలంగాణలో కొత్తగా 1,198 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!
X
Coronavirus updates in Telangana:

Coronavirus updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,198 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 46,274కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 11,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,885 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 34,323 కి చేరుకుంది. ఇక ఇవ్వాలా ఏడుగురు కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 422 కి చేరుకుంది.ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 510 కేసులు ఉన్నాయి.

ఇక మిగతా జిల్లాల విషయానికి వచ్చేసరికి.. రంగారెడ్డి 106, మేడ్చెల్ 76, సంగారెడ్డి 10, వరంగల్ అర్బన్73, కరీంనగర్ 87,జగిత్యాల 36, మహబూబబాద్ 36, మహబూబ్ నగర్ 50, భూపాలపల్లి 26, నల్గొండ 24, నిజామాబాద్ 31, నాగూర్ కర్నూల్ 27, సూర్యాపేట 12, జనగామ 12, ములుగు 9, సిద్దిపేట 3, గద్వాల్ 3, పెద్దపెల్లి 8, మెదక్ 13, ఖమ్మం 3, వరంగల్ రూరల్ , నిర్మల్, యాదాద్రి భువనగిరి లలో ఒక్కో కేసు నమోదు ఆయునట్టుగా సోమవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.



Krishna

Krishna

Next Story