తమిళనాడులో కొత్తగా 1,286 కేసులు..

S. Srikanth
Updated on: 3 Jun 2020 9:28 PM IST
తమిళనాడులో కొత్తగా 1,286 కేసులు..
X

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక తమిళనాడులో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,286 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 610 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మీద తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 25,872కు పెరిగాయి. గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 208 మంది చనిపోయారు. ఇప్పటివరకు 14,316 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,345 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

భారత్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 8,820కరోనా పాజిటివ్ కేసులు నమోద అయ్యాయి. గత 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా 221 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల 2,07,191 నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,01,066గా ఉంది. 1,00,285 చికిత్స కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి దేశంలో 5829 మొత్తం మృతి చెందారు.


S. Srikanth

S. Srikanth

Next Story