తెలంగాణా సీఎం కార్యాలయంలో కరోనా కలకలం

తెలంగాణా సీఎం కార్యాలయంలో కరోనా కలకలం
x
Highlights

తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనా కలకలం రేపింది.

తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మెట్రో రైల్‌ భవన్‌లోని సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి వచ్చిన సీఎంవో ఉద్యోగి కుమారుడి ద్వారా ఆ ఉద్యోగికి వైరస్‌ సోకిందని గుర్తించారు.

సీఎంవో ఆఫీసుకు రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 30 మంది సిబ్బంది శాంపిళ్లను చెస్ట్ ఆస్పత్రి వైద్య సిబ్బంది సేకరించారు. సీఎంఓ లో పని చేస్తున్న వారిలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఉన్నారు. దింతో వారంతా ఆందోళనలో ఉన్నారు.

సీఎంఓ సానిటై జెషన్ చేస్తున్న సిబ్బంది.. పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుంచి విధులు నిర్వహించిన ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ బిఆర్కే భవన్ లోని ఓ ఉద్యోగిని క్వారంటైన్ ఉంచారు. కరోనా లక్షణాలతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు ఆ ఉద్యోగి హాజరు కావడంతో సీఎంఓలో అధికారుల్లో మరింత ఆందోళన నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories