తెలంగాణలో కొత్తగా 169 కేసులు..

S. Srikanth
Published on: 29 May 2020 10:19 PM IST
తెలంగాణలో కొత్తగా 169 కేసులు..
X
Representational Image

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(గురువారం) ఒక్క రోజే 117 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అత్యధికంగా 169 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 82 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్‌ 2, సంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. వలస కూలీలు 5, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 71 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,425కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 973 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1381 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మే31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే!




S. Srikanth

S. Srikanth

Next Story