Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు!

Coronavirus Updates in Telangana:రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 921 పాజిటివ్‌ కేసులుగా తేలాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,65,049కి చేరుకుంది.

Krishna
Published on: 24 Nov 2020 10:23 AM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు!
X

Coronavirus Updates in Telangana : తెలంగాణలో మొన్నటిదాకా తగ్గుముఖం పడుతూ వచ్చిన కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరిగాయి. నిన్న 600 దాటిన పాజిటివ్ కేసులు.. ఇవాళ 900 వందలు దాటాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 921 పాజిటివ్‌ కేసులుగా తేలాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,65,049కి చేరుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక అటు కరోనాతో మరో నలుగురు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,437కి చేరింది. నిన్న కరోనాబారి నుంచి 1,097 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 2,52,565కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,047 యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 8,720 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 52,01,214కి చేరుకుంది.

Krishna

Krishna

Next Story