Khairatabad Ganesh 2020: ఖైరతాబాద్ వినాయకుడు..ఈసారి ఎలా ఉండబోతున్నాడు?

Khairatabad Ganesh 2020: ఖైరతాబాద్ వినాయకుడు..ఈసారి ఎలా ఉండబోతున్నాడు?
x
Highlights

Khairatabad Ganesh 2020: ఎత్తైన వినాయకుడిగా ఖైరతాబాద్ గణేశుడికి పేరు ఉంది. ఇక్కడ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం ఆ...

Khairatabad Ganesh 2020: ఎత్తైన వినాయకుడిగా ఖైరతాబాద్ గణేశుడికి పేరు ఉంది. ఇక్కడ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం ఆ ప్రభ కనిపించడం లేదు. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఖైరతాబాద్ వినాయకుడికి కూడా తగలింది. ఖైరతాబాద్ భారీ విగ్రహాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు. అయితే వినాయక చవితి దగ్గర పడుతున్న ఖైరతాబాద్ గణనాథుడు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. మాములుగా వినాయకుడి విగ్రహ తయారీ 4నెలల ముందే ప్రారంభింస్తారు. కరోనా కారణంగా ఆ భారీ విగ్రహాన్ని తయారు చేసే శిల్పులు రాకపోవడంతో ఖైరతాబాద్ వినాయకుడి స్థలం బోసిపోయి ఉంది.

ఖైరతాబాద్ గణనాథుడు గతేడాది ద్వాదశదిత్యాయ రూపం లో భక్తులకు దర్శనం ఇచ్చాడు కానీ ఈ ఏడాది మాత్రం విష్ణు రూపంలో తయారు చెయ్యలనుకున్నారూ. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదను ఉత్సవ కమిటీ వారు అన్నారు. కానీ మొత్తానికి విగ్రహం పెడతామని ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ రాజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.



Show Full Article
Print Article
Next Story
More Stories