Coronavirus: ఎవరికి ఉందో.. ఎవరికి లేదో తెలియక ఆందోళన చెందుతున్న కండక్టర్లు, డ్రైవర్లు

Coronavirus: Covid Second wave hits TSRTC Employs
x

Coronavirus: ఎవరికి ఉందో.. ఎవరికి లేదో తెలియక ఆందోళన చెందుతున్న కండక్టర్లు, డ్రైవర్లు

Highlights

Coronavirus: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు దాదాపు 12 వందల మందికి పైగా ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది.

Coronavirus: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు దాదాపు 12 వందల మందికి పైగా ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. మరో 40 మంది ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. ప్రయాణీకుల్లో ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో గుర్తించడం కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని కోరుతున్న ఆర్టీసీ ఉద్యోగులపై హెచ్ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్.

ఆర్టీసీ ప్రయాణీకులతో నగరంలో వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. ఎక్కిన ప్రయాణీకుల్లో ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో తెలియక కండక్టర్లు, డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. బస్సు ఎక్కే ముందు చేయాల్సిన థర్మల్ స్క్రినింగ్ లేక మరింత ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు. ఉద్యోగులకు సరిపడ మాస్కులు, శానిటైజర్లు, ఫెస్ షీల్డ్ లు లేకపోవడం వల్ల వైరస్ వేగంగా విస్తరిస్తుందని అంటున్నారు. నిత్యం భయంతో డ్యూటీలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

కార్మికుల్లో మనోధైర్యం నింపాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపైనే ఉందని అంటున్నారు ఆర్టీసీ యూనియన్ నాయకులు. ఇప్పటివరకు 12 వందల మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా మరో 40 మంది కరోనాతో మృతి చెందారని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తార్నాకలోని ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వంద బెడ్స్ తో కొవిడ్ వార్డుని ఏర్పాటు చేయాలని కోరారు.

సింగరేణి తరహా కోవిడ్‌కు ఎక్కడ వైద్యం చేయించుకున్న రియంబర్స్మెంట్ ఇచ్చే సౌకర్యం కల్పించాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్. కరోనా పేషెంట్ లకు మాత్రమే కాకుండా ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి కూడా రవాణా సౌకర్యాలను కల్పిస్తున్న ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల భీమా సౌకర్యం కల్పించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కరోజేలోనే ముషీరాబాద్ ఆర్టీసీ డిపోలో పని చేసే కండక్టర్, వరంగల్‌లో ఓ డ్రైవర్, నిజామాబాద్, చెంగిచర్ల డిపోలోకు చెందిన డ్రైవర్లు కొవిడ్‌తో మరణించారని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు తార్నాక హాస్పిటల్ లో కొవిడ్ వార్డు ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. 170 బెడ్స్ ఉన్నాయని వాటికి ఆక్సిజన్ సౌకర్యం కానీ, వెంటిలేషన్ సౌకర్యం లేదని తార్నాక హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ వెంకట రమణ తెలిపారు. ఇప్పటి వరకు వారు 650 మంది కరోనా పేషెంట్ కి చికిత్స అందించినట్లు వెల్లడించారు. మరోవైపు పాజిటివ్ వచ్చిన రోగులకు కరోన కిట్స్‌తో పాటు, ఆక్సీ మీటర్లు అందించి వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు చెప్పారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం తమకు అండగా ఉండాలని ఆర్టీసీ కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories