కామారెడ్డి జిల్లాపై కరోనా మహమ్మారి ప్రతాపం !

కామారెడ్డి జిల్లాపై కరోనా మహమ్మారి ప్రతాపం !
x
Highlights

Coronavirus Cases increasing in Kamareddy: కరోనా స్వైర విహారం చేస్తోంది. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకూ ఏదో తెలియని భయంతో స్మశాన నిశబ్దం అలముకున్నాయి.

Coronavirus Cases increasing in Kamareddy: కరోనా స్వైర విహారం చేస్తోంది. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకూ ఏదో తెలియని భయంతో స్మశాన నిశబ్దం అలముకున్నాయి. లాక్‌డౌన్‌ పాటించినా వైరస్ ఉధృతి తగ్గడం లేదు. ప్రజలు నిర్లక్ష్యంగా బయట తిరుగుతుండటంతో పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కామారెడ్డి జిల్లాలో అధికారులు కీలక నిర్ణయం తీసుకొని వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టారు.

కామారెడ్డి జిల్లాపై కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. గత రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 1156 కేసులు నమోదయ్యాయి. ప్రజల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కరోనా వ్యాప్తికి కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ లాక్ డౌన్ తర్వాత అడపాదడపా స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించినా కేసులు తగ్గలేదు. కేసులు భారీగా నమోదవుతుండటంతో వ్యాపారులు, అధికారుల్లో ఆందోళన మొదలైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతుండడంతో అఖిలిపక్ష నాయకులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు పది రోజుల స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు.

ఆగస్టు 8 నుంచి స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు అయిన ఆసుపత్రులు, మెడికల్‌ దుకాణాలు, ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్‌ కట్టడికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలు, వ్యాపారులు ఈ నిర్ణయానికి కట్టుబడి కరోనా రహిత కామారెడ్డికి సహకరించాలని అధికారులు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories