తెలంగాణలో పురాతన శాసనం గుర్తింపు

తెలంగాణలో పురాతన శాసనం గుర్తింపు
x
శిలాశాసనం
Highlights

Archeological Experts Discovers An Inscription : ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా జరిపే తవ్వకాల్లో చరిత్ర సంబంధించిన కొన్ని ఆనవాలు దొరుకుతున్నాయి.

Archeological Experts Discovers An Inscription : ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా జరిపే తవ్వకాల్లో చరిత్ర సంబంధించిన కొన్ని ఆనవాలు దొరుకుతున్నాయి. ఇదే తరహాలో పురాతన చరిత్రకు సాక్ష్యమైన మరో ఆనవాలును పురావస్తు శాస్త్ర వేత్తులు కనుగొన్నారు. చరిత్రకు సబంధించిన ఓ శాసనాన్ని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో గుర్తించారు. ఓ కొండపై ఉన్న పెద్ద బండరాయిపై ఐదు అక్షరాలతో చెక్కి ఉన్న ఈ శాసనాన్ని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు ఇది అశోక బ్రహ్మీ లిపిలో ఉన్నట్లుగా తేల్చారు. ఆ ఐదు అక్షరాల పదానికి అర్థం 'మాధవచంద' అని తెలిపారు. అసలు ఇది ఓ వ్యక్తి పేరా లేదా ఇంకేదయినా అయివుంటుందా అని వారు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోని లిపి శాస్త్ర నిపుణుడు మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ ఇది ఈ ప్రాంతంలో కనుగొన్న మొదటి శాసనం అని వెల్లడించారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి సంబంధించిన వివరాలను విశ్లేషించేందుకు ఇది ఎంతగానో సాయపడుతుందని, దీనికి ఈ శాసనం ఎంతో కీలకమైందని వారు వెల్లడించారు. ఇది తెలంగాణ పురాతన చరిత్రకు అద్దం పడుతోందని పురావస్తు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఈ శాసనాన్ని కనుగొనడం పట్ల గర్వంగా ఉందని ఆయన అన్నారు. గతంలో కోటిలింగాల, ముక్కత్రావుపేట, ధూళికట్ట ఇతర ప్రాంతాల్లో కనుగొన్న శాసనాలకన్నా ఈ శాసనం ఎంతో పురాతనమైందని భావిస్తున్నారు.

ఈ శాసనం కనుగొన్న ఇదే గ్రామంలో రాతి గుహలు, లోనికి మెట్లు ఉన్న బావులు, కొన్ని పేయింటింగ్‌లను కూడా పురావస్తు నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం దొరికిన శాసనాలు, గుర్తులను ఆధారంగా చేసుకుని గ్రామంలో రాతి యుగం నుంచి నిరాటంకంగా మానవ మనుగడ ఉన్నట్లు అర్థమవుతోందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ శాసనం చెక్కిన నాటి కాలం ఆధారంగా తీసుకుంటే ఇది తెలంగాణ ప్రారంభదశలో ఉన్న శాతవాహనుల కాలం నాటికి చెందినదని చెప్పగలమని ఓ పురావస్తు నిపుణుడు చెప్పారు. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి పుట్టుక, తెలంగాణ ప్రాంతంలో వారి ఎదుగుదలను కనుగొనవచ్చు'' అని నిపుణులు విశ్లేషించారు. ''మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, మంజీరా, గోదావరి నదుల ఒడ్డున ఉన్న బోధన్, కొండపూర్ ప్రాంతాల చారిత్రకతను కూడా ఇది బలపరుస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories