తెలంగాణలో భరతమాత ఆలయం..

తెలంగాణలో భరతమాత ఆలయం..
x
భరతమాత విగ్రహం
Highlights

Bharatmata temple in kamareddy : ప్రతి గ్రామంలో గ్రామదేవతల ఆలయాలు, దేవుళ్ల ఆలయాలు దర్శనం ఇస్తూనే ఉంటాయి. కానీ ఓ గ్రామంలోని ఆలయంలో గ్రామదేవతలు కాకుండా ఎక్కడా లేని విధంగా భరత మాత దర్శనం ఇస్తుంది.

Bharatmata temple in kamareddy : ప్రతి గ్రామంలో గ్రామదేవతల ఆలయాలు, దేవుళ్ల ఆలయాలు దర్శనం ఇస్తూనే ఉంటాయి. కానీ ఓ గ్రామంలోని ఆలయంలో గ్రామదేవతలు కాకుండా ఎక్కడా లేని విధంగా భరత మాత దర్శనం ఇస్తుంది. ఈ భరత మాతకు ఆ గ్రామస్థులు అంతా పూజలు చేస్తూ ప్రతి ఏడాది ఉత్సవాలు కూడా నిర్వహించి, దేశభక్తిని చాటుకుంటున్నారు. భరత మాతకు ఆలయం ఉండడం, ప్రతి ఏటా ఉత్సవాలు జరగడం వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండ‌లంలో ఈ భరతమాత ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పిస్క లక్ష్మయ్య అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1950వ సంవత్సరంలో ఓ గుడిసెలో ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాత కొద్ది రోజులకు బుర్రి గంగారాం, నక్క (మంగ‌లి) రామన్న సహకారంతో పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించారు. అంతే కాదు గ్రామంలోని కొంత మంది దాతలు ఆలయ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఇచ్చారు. అంతే కాదు ఆ గ్రామంలోని పద్మశాలి సంఘం సభ్యులు ఆలయ నిర్మాణపు పనులు నడుస్తుండగానే తాము కూడా ముందుకొచ్చారు. 1982 ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేసి భరత మాత విగ్రహంతో పాటు నవగ్రహాలను పలు దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. అన్ని దేవాలయాలలో జరిగినట్టుగానే ఈ ఆలయంలో కూడా ప్రతిరోజూ దీప ధూప నైవేద్యాలు సమర్పించేందుకు పూజారిని కూడా నియమించారు.

ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ప్రతి ఏడాది ఈ ఆలయంలో భరతమాత జయంతి వేడుకలను మార్గశిర శుక్ల షష్ఠి రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున గ్రామస్థులందరూ ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అర్చనలు చేపడతారు. భరతమాత గుడిలో మొక్కులు తీర్చుకుంటారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. భారతదేశ విశిష్టత గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఈ ఆలయం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మక మైన ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. వింటుంటే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూడాలని ఉంది కదూ. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించిన మీ దేశభక్తిని చాటుకోండి.


Show Full Article
Print Article
Next Story
More Stories