Hyderabad Old City: హైదరాబాద్‌లోని పాతబస్తీలో వైరస్ వ్యాప్తి అంతంత మాత్రమే

Coronavirus Away From Hyderabad old City
x

హైదరాబాద్ ఓల్డ్ సిటీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad Old City: పాతబస్తీలో వైరస్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉండడం వైద్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.

Hyderabad old City: దేశమంతా కరోనా తో అల్లాడుతుంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ మాత్రం దానికి దూరంగా వుంది. స్థానికంగా ఉన్న పీహెచ్ సీల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 10శాతం లోపు వుండడం ఇటు ప్రజల్ని, అటు వైద్యులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ఈ రేటు 40 నుంచి 50 శాతంగా ఉండడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...పాతబస్తీ పీహెచ్‌సీలలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వారిలో 5 శాతం మంది కూడా పాజిటివ్‌గా తేలడం లేదు. పాతబస్తీలోని 18 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నారు. దారుల్‌షిపా ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 10న 50 మందికి పరీక్షలు చేస్తే వారిలో ఒక్కరు మాత్రమే పాజిటివ్‌గా తేలారు. వైరస్‌ను కచ్చితంగా పట్టుకోగలిగే ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్ రేటు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

ఇక దారుల్‌షిఫా, అజాంపుర, యాకుత్‌పుర ఆరోగ్య కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల్లో 99 శాతం మంది నెగటివ్‌గానే బయటపడుతున్నారు. మరీ ముఖ్యంగా యాకుత్‌పుర-2 పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్ రేటు సున్నాగా ఉండడం గమనార్హం. ఈ పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు 471 మందికి పరీక్షలు చేస్తే ఒక్కరు కూడా కొవిడ్ బారినపడినట్టు నిర్ధారణ కాలేదు.

పాతబస్తీలో వలసలు తక్కువగా ఉండడం, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన హలీం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇక్కడ పాజిటివిటీ రేటు తక్కువగా ఉండడానికి బహుశా అదే కారణమై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ఈ ప్రాంతాల్లో డ్రైఫ్రూట్స్ వినియోగం కూడా ఎక్కువని, ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయని అంటున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో వైరస్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉండడం వైద్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories