తెలంగాణా ఎమ్మెల్యే భార్య స‌హా మ‌రో ముగ్గురికి క‌రోనా

K V D Varma
Published on: 14 Jun 2020 7:21 AM IST
తెలంగాణా ఎమ్మెల్యే భార్య స‌హా మ‌రో ముగ్గురికి క‌రోనా
X
Representational Image

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. కేవలం ఎమ్మెల్యే కాదు... ఏకంగా మంత్రులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణా ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య సహా మరో ముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

టీఆరెఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ‌గా… ఆయ‌నతో కాంటాక్ట్ అయిన వారికి టెస్ట్ చేస్తే మ‌రో న‌లుగురికి సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.

ఎమ్మెల్యే స‌తీమ‌ణితో పాటు వంట మ‌నిషి, డ్రైవ‌ర్, గ‌న్ మెన్ కు కూడా క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. ఎమ్మెల్యే ఇప్ప‌టికే ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా… ఎమ్మెల్యే కుటుంబం అంతా క్వారెంటైన్ లో ఉంది. దీంతో వారికి టెస్టులు చేయ‌గా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది.

జ‌న‌గామ ఎమ్మెల్యేకు క‌రోనా సోకింద‌న్న వార్త‌తో… ఆయ‌న ఎవ‌రెవ‌ర్ని క‌లిశారు అన్న‌దానిపై అధికారులు ఆరా తీస్తుండ‌గా, ఈ మ‌ధ్య త‌న‌ను క‌లిసిన వారంద‌రు ఇప్పుడు భ‌యంభ‌యంగా ఉన్నారు. ఎమ్మెల్యే కోలుకుంటున్నారు… మీరంతా ఆయ‌న‌పై చూపిస్తున్న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ఎమ్మెల్యే స‌తీమ‌ణి ఈరోజు మ‌ద్యాహ్న‌మే ఓ వాయిస్ సందేశాన్ని పంపింది. ఇప్పుడు వారికి కూడా కరోనా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది

K V D Varma

K V D Varma

Next Story