లాక్ ‌డౌన్ విధించరూ..ప్లీజ్! ప్రభుత్వానికి నెటిజన్ల రిక్వెస్ట్

లాక్ ‌డౌన్ విధించరూ..ప్లీజ్! ప్రభుత్వానికి  నెటిజన్ల రిక్వెస్ట్
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి వేలలో టెస్టులు చేస్తే వందల్లో కేసులు బయటికి వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి వేలలో టెస్టులు చేస్తే వందల్లో కేసులు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా కేసులు నమోదవుతుండడంతో నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇతర జిల్లాల ప్రజలను కూడా కరోనా వైరస్ పీడిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని, హైదరాబాద్‌లోనూ లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరిగింది. మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం ఊపందుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రచారానికి చెక్ పెట్టింది. రాష్ట్రంలో ఎలాంటి లాక్ డౌన్ విధించడంలేదంటూ స్పష్టం చేసింది. దీంతో కొంత మంది నగరవాసులు లాక్‌డౌన్ విధిస్తేనే కరోనాను కట్టడి చేయగలం అని అభిప్రాయపడుతున్నారు. అత్యవసరం అయితేనే పట్టణానికి రండి లేదంటే ఉన్న ఉళ్లోనే ఉండిపోండి అంటూ తమ సన్నిహితులకు సమాచారం అందిస్తున్నారు.

ఇక పోరుగురాష్ట్రమైన ఏపీలో కూడా కేసుల సంఖ్య భారీగానే పెరిగిపోతున్నాయి. భారీ సంఖ్యలో కరోనా టెస్టులు చేయడంతో, కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మూడు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. ప్రస్తుతం మరో రెండు జిల్లాలను తాజాగా పొడిగించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఐదు జిల్లాలు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తెలంగాణలోనూ అక్కడక్కడా కొన్ని పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి.

ఇక తమిళనాడులోనే ఇదే పరిస్థితి. అక్కడ కూడా కేసులు కుప్పలుగా పెరిగిపోవడంతో ప్రభుత్వం చెన్నైలో లాక్‌డౌన్ విధించింది. అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం అవసరమైతే బెంగళూరు లో లాక్‌డౌన్ విధిస్తామని తెలిపారు. ఇప్పటికే బెంగళూరులో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. ఇన్ని రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను చూసిన తెలంగాణ నెటిజన్లు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌, తెలంగాణ సీఎంవోలను ట్యాగ్ చేసి ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఈ మెసేజ్ లను చూస్తున్న ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories