Coronavirus: తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం

Coronavirus: ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు పాజిటివ్‌ * శనివారం మండలిలో మాట్లాడిన సతీష్

Sandeep Eggoju
Published on: 22 March 2021 12:51 PM IST
Corona Fear Telangana Legislative Council
X

తెలంగాణ శాసన మండలి (ఫైల్ ఫోటో)

Coronavirus: తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం రేపింది. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కరోనా బారిన పడ్డారు. శనివారం మండలికి హాజరై మాట్లాడిన పురాణం సతీష్‌‌ ఇవాళ హాజరుకాలేదు. అయితే ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మండలి సభ్యులు, సిబ్బందిలో కలవరం మొదలైంది.

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి నిన్న ఇద్దరు బాధితులు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 337 కేసులు నమోదవగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 91 కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 958 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 5 వేలకు చేరువయ్యాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story