Hyderabad: బీఆర్కే భవన్‌లో కరోనా కలకలం

Hyderabad: నేషనల్ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌లో కరోనా బారిన పడిన అధికారులు

Sandeep Eggoju
Updated on: 30 March 2021 1:56 PM IST
Corona Fear in BRK Bhavan Hyderabad
X
బీఅర్కే భవన్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో కొంతమంది ఉద్యోగులు, అధికారులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆఫీస్‌కు వెళ్లాలంటేనే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.వారి కుటుంబాల్లోనూ భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఆఫీస్‌కు వచ్చి విధులు నిర్వర్తించాలని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story