Corona Cases in India: భారత్‌లో కొత్త‌గా 3,86,452 కరోనా పాజిటివ్ కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 30 April 2021 10:19 AM IST
Corona Cases in India: 3,86,452 New Coronavirus Cases Reported in India on 30 April 2021
X

కరోనా (ఫైల్ ఇమేజ్ )

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 1.87కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,86,452 కేసులు నమోదు కాగా, 3498 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,97,540 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 31,70,228 ఉండగా, 1,53,84,418 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 2,08,330 మంది కరోనా వ్యాధితో మరణించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 19,20,107 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 3,86,452 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.87కోట్లకు చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story