ఒమిక్రాన్‌తో ఉలిక్కిపడ్డ టోలీచౌకి.. కంటైన్‌మెంట్ జోన్‌గా పారామౌంట్ కాలనీ

Containment Zone: ఒమిక్రాన్ కేసుల నమోదుతో హైదరాబాద్‌లోని టోలీచౌకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Arun Chilukuri
Published on: 16 Dec 2021 5:00 PM IST
Containment Zone Around Paramount Colony
X

ఒమిక్రాన్‌తో ఉలిక్కిపడ్డ టోలీచౌకి.. కంటైన్‌మెంట్ జోన్‌గా పారామౌంట్ కాలనీ

Containment Zone: ఒమిక్రాన్ కేసుల నమోదుతో హైదరాబాద్‌లోని టోలీచౌకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పారామౌంట్‌ కాలనీలో బుధవారం రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆ ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25ఇళ్ల పరిధిలో కంటైన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశారు.

ఒమిక్రాన్ వెలుగు చూడడంతో మొత్తం 25 హెల్త్‌టీమ్స్‌ రంగంలోకి దిగి 700 ఇళ్లలోని ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే 136 మందికి RT-PCR పరీక్షలు పూర్తి కాగా వీరి ఫలితాలు 36 గంటల్లో వస్తాయని అధికారులు తెలిపారు. ఇక RT-PCR పరీక్షల్లో పాజిటివ్ వస్తే జినోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story