Hyderabad: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్.. ఆస్పత్రికి తరలించేలోపే...

Hyderabad: ఫిట్‌నెస్ కోసం జిమ్ చేస్తే హార్ట్ ఎటాక్ తప్పదా?

Arun Chilukuri
Published on: 24 Feb 2023 12:13 PM IST
Constable Vishal Died at GYM due to Heart Attack
X

Hyderabad: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్.. ఆస్పత్రికి తరలించేలోపే...

Hyderabad: ఫిట్‌నెస్ కోసం జిమ్ చేస్తే హార్ట్ ఎటాక్ తప్పదా? వరుసగా జరుగుతున్న ఘటనలు ఇటువంటి భయాన్ని కలిగిస్తోంది. హీరోలు పునీత్ నుంచి తారకరత్న దాకా.. గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. తాజాగా సికింద్రాబాద్‌లో జిమ్ చేస్తూ ఓ కానిస్టేబుల్‌ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. విశాల్ అనే కానిస్టేబుల్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సికింద్రాబాదులోని ఓ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విశాల్ పరిస్థితిని గమనించిన తోటి మిత్రులు వెంటనే స్పందించి.. అతడిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విశాల్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్ గౌస్‌మండీకి చెందిన 24 ఏళ్ల విశాల్.. 2020లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story